- వెంటనే పునరుద్ధరణ పనులు
- కార్పొరేటర్లతో కలిసి పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ గాంధీ
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని విశ్వేశరయ్య కాలనీలో బజాజ్ ఎలక్ట్రానిక్స్ షో రూమ్ సమీపంలో ట్రాన్స్ మిషన్ మంజీర తాగునీటి పైప్ లైన్ అకస్మాత్తుగా పగిలిపోయింది. వెంటనే పైప్ లైన్ పునరుద్ధరణ పనులను జలమండలి చేపట్టగా.. కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మంజీరా పైప్ లైన్ ఆకస్మికంగా పగిలిపోవడం చాలా దురదృష్టకరమని, పైప్ లైన్ పగిలిపోవడం వల్ల చుట్టూ పక్కల ఉన్న అపార్ట్ మెంట్ సెల్లర్లు నిండిపోయాయని, HMWS&SB, GHMC, ఎలక్ట్రికల్ అధికారులు సమన్వయం చేసుకొని పైప్ లైన్ పునరుద్ధరణ పనులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు , HMWS &SB ట్రాన్స్ మిషన్ GM మాణిక్యం, DGM మహ్మద్ అజారుద్దీన్, మేనేజర్ అన్వర్, GHMC AE సంతోష్ రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు సందీప్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, నరేందర్ బల్లా పాల్గొన్నారు.