యాదవ్ యుద్ధ భేరి భారీ బహిరంగ సభకు హాజరుకండి

  • మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఆహ్వానం

నమస్తే శేరిలింగంపల్లి: యాదవ్ యుద్ధ భేరి భారీ బహిరంగ సభకు రావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆహ్వానించారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో ఆయనను కలిసి యుద్ధ భేరి సభకు రావాలని రాష్ట్ర యాదవ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు చలకాని వెంకట్ యాదవ్, శ్రీకృష్ణ యాదవ్ సంగం ట్రస్టు వర్కింగ్ ప్రెసిడెంట్ చింతల రవీందర్ యాదవ్, రాష్ట్ర విద్యావంతుల వేదిక గౌరవ సలహాదారుడు భేరీ రామచందర్ యాదవ్ కోరారు. అనంతరం ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆగస్ట్ 25న జరిగే యాదవ యుద్ధ భేరికి హాజరు కావాలని యాదవ సంఘం డిమాండ్‌లపై బిఆర్ స్ పార్టీ వైఖరిని ప్రకటించాలని అభ్యర్థించారు.

దేశంలో, రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ముంచుకొస్తున్న ఈ తరుణంలో యాదవుల రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక వాటా కోసం ఉద్యమించాలనే లక్ష్యంతో క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న యాదవ సంఘాలన్నిటిని ఏకతాటిపైకి తెచ్చేలా యాదవ యుద్ధ భేరిని నిర్వహిస్తున్నామని తెలిపారు. మన జాతికి రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సమానత్వం సాధించే బాధ్యతతో యాదవ విద్యావంతుల వేదిక యాదవ యుద్ద భేరి సమావేశం ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో యాదవులు 18 శాతం జనాభా ఉన్నదని గణాంకాలు చెబుతున్నాయని, కానీ జనాభా దామాషా పద్ధతిలో రాజకీయ ప్రాతినిధ్యంలో, ఆర్థిక అవకాశాల్లో, విద్యా, ఉద్యోగ, సాంస్కృతిక రంగాల్లో వెనుకేయబడ్డామని తెలిపారు. కావునా ఈ కింది డిమాండ్ల సాధనకై సమరశీల పోరాటాలు చేసి, యాదవ జాతి అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత మన అందరిమీద ఉన్నదని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు యాదవులు, యాదవ ఉపకులాలకు 22 ఎమ్మెల్యే, 7 ఎమ్మెల్సీ, 5 ఎం.పి. సీట్లు ఇవ్వాలన్నారు. జన గణనలో కుల గణన వెంటనే చేపట్టాలని, యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రాష్ట్ర బడ్జెట్లో యాదవులకు 18 శాతం నిధులు కేటాయించాలన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వెంటనే రద్దు చేయాలన్నారు. యాదవులకు ఎస్.ఎన్.టి రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించారు.ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ని, కేటీఆర్ గారిని కలిసి చర్చించి ఎక్కువ మొత్తంలో సీట్లు వచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో యాదవ విద్యా వంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకట్ యాదవ్, గొర్రె మేకల పెంపకం దారుల చైర్మన్ శ్రీహరి యాదవ్, యాదవ విద్యా వంతుల వేదిక ప్రధాన కార్యదర్శి ఓరుగంటి వెంకటేశ్వర్లు యాదవ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ పాండురంగారావు యాదవ్, రాజు యాదవ్ బిహెచ్ఎల్, సభ్యులు మేకా లలిత యాదవ్, సమతా యాదవ్, శ్రీనివాస్ యాదవ్, శేషు వుయాదవ్, నగేష్ యాదవ్, సిద్ది రమేష్ యాదవ్, నోముల సైదులు యాదవ్, రంగారెడ్డి జిల్లా బిజెపి పార్టీ ఫోక్స్ పర్సన్ అందేల కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here