- 20 మంది బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా.. 20 మంది బాధితులకు సీఎంఆర్ఎఫ్ నుంచి నిధులు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయానికి సంబంధించి మంజూరైన రూ. 8లక్షల 20వేల ఆర్థిక సహాయానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబాలకి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరమని, ప్రజాక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. వైద్య చికిత్సకి సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి బాధితుల కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.