నమస్తే శేరిలింగంపల్లి :మేడ్చల్ అర్బన్ జిల్లా బిజెపి కార్యాలయం అటల్ జి భవన్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమాన్ని గీతాసెల్ కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా కల్పన ఏకాంత్ గౌడ్ మాట్లాడుతూ మొగల్ పాలకుల ఆధిపత్యాన్ని ఎదిరించి స్వయం పాలన చేసిన ధీరుడు, రాజరికపు వ్యవస్థలో జమీందార్లు జగిర్దార్ల ఆగడాలను ఎదిరించి పోరాడిన యోధుడు, సామాన్యుడు సైతం రాజ్యం ఏలగలడు అని ఆచరణలో చూపించిన మార్గదర్శి “సర్దార్ సర్వయి పాపన్న గౌడ్” అని కొనియాడుతూ ఘనంగా నివాళులర్పించారు.