- అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
నమస్తే శేరిలింగంపల్లి : 78వ భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చందానగర్ లోని సరస్వతి విద్యా మందిర్ హై స్కూల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇక్రిశాట్ సీనియర్ సైంటిస్ట్ శోభన్ సజ్జ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ఉత్తేజకరమైన ప్రసంగం చేశారు.
“మనం చేయాలనుకున్న పని, చేయనివ్వకపోవడం, మన అభివృద్ధికి అడ్డు తగలడమే స్వాతంత్యం లేకపోవడం. ఈ నిర్బంధాలను ఎదుర్కొని మనకు స్వాతంత్యం ఎలా వచ్చిందో, ఈ స్వాతంత్య్ర భారతంలో విద్యార్థుల పాత్ర ఏమిటో” విద్యార్థుల స్థాయికి అర్థమయ్యేటట్లుగా ఉద్బోధన చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ రఘునందన్ రెడ్డి, కో సెక్రటరీ రామచంద్రారెడ్డి, ట్రెజరర్ నాగభూషణం రావు, సభ్యులు సుదీప్ రెడ్డి, ప్రిన్సిపాల్ అరుణ, అధ్యాపక బృందం పాల్గొన్నారు.