- శేరిలింగంపల్లి జనసేన పార్టీ నియోజక వర్గ ఇంఛార్జి డాక్టర్ మాధవ రెడ్డి
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి జనసేన పార్టీ నియోజక వర్గ ఇంఛార్జి డాక్టర్ మాధవ రెడ్డి ఆధ్వర్యంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు.
మన దేశం యువకులతో నిండిన భారతదేశం, దేశ యువత రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించాలని, ఎన్నో రంగాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న యువత కొనియాడుతూ ఒలంపిక్ క్రీడల్లో పతాక విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వివిధ డివిజన్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.