ఘన స్వాగతం పలుకుదాం.. కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం : ప్రభుత్వ విప్ గాంధీ

  • ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులతో సన్నాహక సమావేశం

నమస్తే శేరిలింగంపల్లి : హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ (మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం) విస్తరణకు డిసెంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి కేసిఆర్ శంకుస్థాపన చేయనున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు సాయి బాబా, మాధవరం రంగరావు, ఆయా డివిజన్ అధ్యక్షులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సన్నాహక సమావేశం నిర్వహించారు.

సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని సన్మానిస్తున్న దృశ్యం

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీగా జన సమీకరణతో తరలి వెళ్లి సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలుకుతూ శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేస్తూ కార్యక్రమానికి తరలివెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజు, మాజీ కౌన్సిలర్లు వీరేశం గౌడ్, మోహన్ గౌడ్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, రాజు నాయక్, సమ్మారెడ్డి, BSN కిరణ్ యాదవ్, లక్ష్మీనారాయణ, అధ్యక్షులు వాలా హరీష్ రావు, దామోదర్ రెడ్డి, గంగాధర్, అనిల్ రెడ్డి, తెరాస నాయకులు చంద్రిక ప్రసాద్, గుడ్ల శ్రీనివాస్, శ్రీనివాస్ గోపారాజు, ఓ.వెంకటేష్, నర్సింహ రాజు పాల్గొన్నారు.

సన్నాహక సమావేశం లో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here