హెచ్‌సీయూలో థాయిలాండ్ విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం… విద్యార్థుల నిరసనలతో సస్పెన్షన్ వేటు…

  • గచ్చిబౌలి పీఎస్ లో, థాయిలాండ్ ఎంబసీలో బాధితురాలు ఫిర్యాదు
  • హెచ్ సీయూ మెయిన్ గేట్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన
  • ఇప్పటికే ప్రొఫెసర్ రవి రంజన్ పై మూడు కేసులు ఉన్నట్లు సమాచారం
హెచ్ సి యు మెయిన్ గేట్ వద్ద ప్రొఫెసర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు

నమస్తే శేరిలింగంపల్లి: విద్యాబుద్దులు నేర్పాల్సిన ఆచార్యు డే విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ ప్రొఫెసర్ ఒడిగట్టిన నీచానికి అతడిని కటినంగా శిక్షించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదలమని హెచ్ సీయూ మెయిన్ గేట్ వద్ద బైఠాయించారు. వివరాలు.. థాయిలాండ్ నుండి ఉన్నత చదువుల కోసం సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన విద్యార్థినిపై గతరాత్రి హిందీ ప్రొఫెసర్ రవీరంజన్ లైంగికదాడికి పాల్పడ్డాడు. రాత్రి 8 గంటలకు క్యాంపస్ నుంచి బయటికి వచ్చిన బాధిత విద్యార్థినిని హిందీ నేర్పిస్తానంటూ తన కారులో ఇంటికి తీసుకెళ్లాడు. ఆ యువతకి మద్యం తాగించి అనంతరం ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగికంగా వేధింపులక పాల్పడ్డాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమెపై దాడికి పాల్పడ్డాడు, తిరిగి యువతిని రాత్రి 9 గంటలకు సెంట్రల్ యూనివర్సిటీ గేటు దగ్గర వదిలిపెట్టి వెళ్లాడు. అక్కడి నుండి బాధితురాలు నేరుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐపీసీ 354 కింద కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు విచారణ చేపట్టారు. ప్రొఫెసర్ పోలీసుల అదుపులోనే ఉన్నాడని ఏసీపీ రఘునందన్ రావు తెలిపారు

ప్రొఫెసర్ రవిరంజన్

ఇప్పటికే ప్రొఫెసర్ రవి రంజన్ పై మూడు కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో నమోదైన కేసులపై చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ ఘటన చోటుచేసుకుని ఉండేది కాదంటున్నారు విద్యార్థులు. అలాగే బాధితురాలు థాయిలాండ్ ఎంబసీ అధికారులకు కూడా ఫిర్యాదు చేయడంతో ఇంటర్నేషనల్ వ్యాప్తంగా ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. యూనివర్సిటీలో జరిగిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం కూడా ఫోకస్ చేస్తుందని తెలుస్తోంది. అయితే నెల రోజుల క్రితం ఉమెన్ ఎంపవర్మెంట్ పై ప్రొఫెసర్ రవి రంజన్ ఉపన్యాసం ఇవ్వడం విశేషం. మహిళా సాధికారత మీద ఉపన్యాసాలు ఇస్తూ విద్యార్థినిల మీద లైంగిక దాడికి పాల్పడడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుంది.

థాయిలాండ్ విద్యార్థినిపై లైంగిక దాడిని ఖండిస్తూ ప్రొఫెసర్ పై సస్పెన్షన్ విధించిన హెచ్ సి యూనివర్సిటీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here