నమస్తే శేరిలింగంపల్లి : ప్రతి విద్యార్థిని క్రీడల వైపు ప్రోత్సహించేందుకు పాఠశాలల యాజమాన్యం ప్రణాళికతో ముందుకు వెళ్లాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్ తెలిపారు. మియాపూర్ జేపీ నగర్ లోని సంస్కృతి పాఠశాలలో నిర్వహించిన క్రీడా దినోత్సవంకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

అనంతరం మాట్లాడుతూ విద్యార్థులను తల్లిదండ్రులు క్రీడల వైపు ప్రోత్సహించాలని, ప్రతి రోజు గంట సేపు మైదానంలో ఉండే విదంగా చూడాలని సూచించారు. పాఠశాలలో నిర్వహించిన క్రీడాపోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. క్రీడా దినోత్సవం పురస్కరించుకొని పాఠాశాలలో నిర్వహించిన పలు ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ పోలీస్ అధికారి డాక్టర్ రాజా శిఖామణి, పాఠాశాల డైరెక్టర్ సురేశ్ బాబు, ప్రిమ్సిపాల్ తృప్తి ఓరా, డైరక్టర్లు వినూత్న, సుభాకర్ రాబట్టి పాల్గొన్నారు.





