పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

  • శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో
    ఉన్నతాధికారులు, కార్పొరేటర్లతో సమీక్షా సమావేశం
  • ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు ఆదేశం
శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఉన్నతాధికారులు, కార్పొరేటర్లతో సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్నప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

 

నమస్తే శేరిలింగంపల్లి : రంజాన్, శ్రీరామ నవమి పండుగలను ప్రజలందరూ కలిసి మెలిసి ప్రశాంత వాతావరణంలో సోదర భావంతో జరుపుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు. రంజాన్, శ్రీరామ నవమి పండుగల నిర్వహణ ఏర్పాట్ల పై శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీ సుధాంష్, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, మియాపూర్ ఏసీపీ నర్సింహ రావు, ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మి, జీహెచ్ఎంసీ, జలమండలి, పోలీస్ ఇతర విభాగాల అధికారులతో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమీక్షా సమావేశం జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పండుగ సందర్భంగా మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, మసీదు పరిసరాలను పరిశుభ్రంగా ఉండే చర్యలు తీసుకోవాలని, తాగునీటి సమస్య లేకుండా చూడాలని, విద్యుత్ దీపాలు వెలిగే చూడాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని పేర్కొన్నారు. శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని వేడుకలు, ర్యాలీలు, ఉత్సవాల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని, ఆలయాలు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేలా వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని, ప్రజలందరూ కలిసి మెలిసి ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలని, ప్రజలందరూ సోదరభావం వెల్లివిరిసేలా పండుగలను జరుపుకోవాలని, అధికారులు ముందస్తుగా ఆలయాలకు, మసీదులకు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు ఎస్ఈ శంకర్ నాయక్, జలమండలి జీఎం రాజశేఖర్, ఈఈ శ్రీనివాస్ , ఈఈ శ్రీకాంతిని , ఎఎంఓహెచ్ లు నగేష్ నాయక్, కార్తిక్, సీఐ సురేష్, సీఐ తిరుపతి రావు, క్యాస్ట్రో రెడ్డి, ట్రాఫిక్ సిఐ నర్సయ్య, ట్రాఫిక్ సిఐ సుమన్ ,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here