- ఎమ్మెల్యే గాంధీని కలిసి వినతిపత్రం అందించిన కాలనీవాసులు
నమస్తే శేరిలింగంపల్లి :గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో కలిసి ఆ కాలనీ వాసులు వినతిపత్రం సమర్పించారు. దీనిపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించారు. కాలనీలో మౌలిక వసతులు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపి, అదేవిధంగా కాలనీలో అంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్డును వేయాలని, అవసరమున్న చోట డ్రైనేజి వ్యవస్థను మెరుగుపర్చాలని, మంచినీటి వ్యవస్థ ను మెరుగుపర్చాలని, 100 ఫీట్ రోడ్డు లో సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గాంధీకి వినతి పత్రం అందించి కోరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ త్వరలోనే కాలనీలో పర్యటిస్తానని, నల్లగండ్ల హుడా కాలనీలో నెలకొన్న అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని. హుడా కాలనీలో అన్ని రకాల మౌలిక వసతులు కలిపించామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్లను అతి త్వరలో చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ , కాలనీ వాసులు శ్రీకాంత్, కిషోర్, రాజేశ్వర్ రావు, శ్రీరామ్, రామ రావు పాల్గొన్నారు.