నమస్తే శేరిలింగంపల్లి: ఇటీవల కురిసిన వర్షానికి లింగంపల్లి బ్రిడ్జి నీట మునిగిన విషయం విదితమే. దశాబ్దాలుగా వరద నీటిలో మునుగుతున్న ఈ సమస్యపై జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ జనసైనికులతో జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ని కలిసి వివరించారు. వివరించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో శేరిలింగంపల్లి జనసేన పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ మాధవ రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షులు అరుణ్ కుమార్, జన సైనికులు శ్రవణ్ ఉపేంద్ర ప్రశాంత్, నరేష్ , ఇతర జనసైనికులు పాల్గొన్నారు.
