- ఏళ్ళు గడుస్తున్నా అభివృద్ధి కానీ బస్తీలు, కాలనీలు
- 27 వ రోజు గడప గడపకు బీజేపీ రవన్న ప్రజాయాత్రలో బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యదవ్
నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలను మోసపూరిత హామీలతో ఎన్నాళ్ళు నమ్మిస్తారు, మీ మాయ మాట మాటలు, మోసపూరిత హామీలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ అన్నారు. గడప గడపకు బీజేపీ రవన్న ప్రజాయాత్ర కార్యక్రమంలో భాగంగా కొండాపూర్ డివిజన్ లోని బంజార బస్తి, వడ్డెర బస్తి లలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి , బీజేపీ శ్రేణులతో కలిసి పర్యటించి మాట్లాడారు. ఏళ్ళు గడుస్తున్నా ఇంత వరకు రోడ్లు లేవని, చెత్త ఎక్కడ పడితే వేస్తున్నారని , డ్రైనేజీ లైన్లు కూడా సరిగా లేవని స్థానిక కాలనీ వాసులు చెబుతున్నారని అన్నారు. ఇన్ని సమస్యలు ఉంటే అధికారాలు, నాయకులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. బి.ఆర్ .ఎస్ నాయకుల మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని , నిన్న మహారాష్ట్ర లో ప్రజలు ఎలా ఒడించారో గమనించాలని అన్నారు. కార్యక్రమంలో ఆంజనేయులు సాగర్, మన్యం కొండా సాగర్, సురేష్, రవి నాయక్, ధన్ రాజ్ నాయక్ , సాగర్ నాయక్, శ్రీకాంత్, కిషన్, సాయి ,వెంకట్, చంద్ర శేఖర్ యాదవ్, ఎల్లేష్, అనిల్ కుమార్ యాదవ్, రమేష్,కె.జితేందర్, భరత్, ఆత్మా రామ్, సంతోష్ , రాజేందర్ ,నవీన్ రెడ్డి, అనిల్, పద్మ , మేరీ, సరోజా రెడ్డి , సంతోష రెడ్డి, పార్వతి, నాగులు, లక్ష్మణ్ ,మధు యాదవ్,గోవర్ధన్ రెడ్డి, గణేష్ , రవి, సామ్రాట్, శ్రీనివాస్ , నరసింహ కార్యకర్తలు, అభిమానులు, స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు.