- మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి కార్పొరేటర్ల వినతి
మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తి అభివృద్ధికి కృషి చేస్తామని, తమ దృష్టికి వచ్చే ప్రతి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. హాఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ పరిధిలో సీసీ రోడ్లు, నాలాలు, శ్మశానవాటికలు, చెరువుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకొని అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి వినతిపత్రాన్ని అందించారు.