తెలంగాణ ప్రాంత దర్శక నిర్మాత పులి అమృత్ గౌడ్ సారధ్యంలో సాయి సింధు క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన “సలామ్ హైదరాబాద్” సినిమా అక్టోబర్ 1వ తేదీన విడుదల కానుంది. హైదరాబాద్ నగరానికి పల్లెటూరి నుండి వలసవచ్చిన ఓ గీత కార్మికుడు తన జీవితంలో ఎదుర్కొనే ఒడిదుడుకులే కథాంశంగా సినిమాను తెరకెక్కించినట్లు సినిమా యూనిట్ సభ్యులు తెలిపారు. తెలంగాణా భాషా యాస లకు పట్టం కడుతూ నిర్మించిన పక్కా తెలంగాణా చిత్రమని,
ఎందరో నూతన ఔత్సాహిక నటీ నటులకు అవకాశం కల్పిస్తూ దాదాపు వలస జీవులనే సినిమా లో పాత్రలు గా తీసుకొని నిర్మించామని తెలిపారు. సినిమాని www.deccantalkies.com
ద్వారా ఏటిటి లో చిత్రం విడుదల చేయనున్నారు.
తెలంగాణ సినిమాలను ఆదరించండి: పులి అమృత్ గౌడ్
కమర్షియల్ హంగులతో కాకుండా తెలంగాణ ప్రాంత పల్లె జీవనాన్ని ప్రతిబింబిస్తూ చిత్ర నిర్మాణాన్ని చేపట్టినట్లు సినిమా దర్శక నిర్మాత పులి అమృత్ గౌడ్ తెలిపారు. వలస కార్మికులు నగరంలో ఎదుర్కొనే సమస్యలను కళ్ళకు కట్టినట్లుగా తెరకెక్కించామన్నారు. కుటుంబ సమేతంగా చూడదగిన సినిమా ఇదని, ప్రతి ఒక్కరి మనసును తాకేలా కథ నడుస్తుందని తెలిపారు. ప్రతీఒక్కరూ సినిమాను తిలకించి తెలంగాణ సినిమాల పట్ల ఆదరణ చూపించాలని ఆయన కోరారు.