ఆల్విన్ కాలనీ డివిజన్ లో పర్యటించిన రవికుమార్ యాదవ్

స్థానికులతో కలిసి పాదయాత్ర చేస్తున్న యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి కుమార్ యాదవ్

ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): కాంగ్రెస్ పార్టీ “బస్తీ గోస” కార్యక్రమంలో భాగంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏం.రవికుమార్ యాదవ్ ఆల్విన్ కాలనీ డివిజన్ లో పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను సిఖ్ కాలనీవాసులు రవి కుమార్ యాదవ్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా రోడ్లు డ్రైనేజీ సమస్యయలతో వారు పడుతున్న ఇబ్బందులను వివరించారు. స్పందిచిన రవి కుమార్ యాదవ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. అదేవిధంగా పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పంచిన భూములను టిఆర్ఎస్ నాయకులు అక్రమించటంపై పోరాటం చేస్తామని అన్నారు. రెండు మూడు రోజుల్లో అందుకు తగిన ప్రణాళికను ప్రకటిస్తామని అన్నారు. ప్రజలు గతంలో చేసిన తప్పులు రానున్న గ్రేటర్ ఎన్నికల్లో చేయవద్దని, ప్రజల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ నర్సింగ్ యాదవ్, సీనియర్ నాయకులు నరసింహ చారి, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

రవి కుమార్ యాదవ్ కు రోడ్ల దుస్థితిని చూపిస్తున్న స్థానికులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here