మియాపూర్ డివిజన్ లో టిఆర్ఎస్ ముమ్మర ప్రచారం

మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): టిఆర్ఎస్ మియాపూర్ డివిజన్ అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్ ఆదివారం మియాపూర్ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని మాయురినగర్, ప్రగతి ఎనక్లేవ్, స్టాలిన్ నగర్, బాలాజీ నగర్, ఎఫ్ సిఐ కాలనీలలో పాదయాత్ర నిర్వహించి ఇంటింటిటికీ తిరుగుతూ టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు

ఎన్నికల ప్రచారంలో పాదయాత్ర నిర్వహిస్తున్న ఉప్పలపాటి శ్రీకాంత్

ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకెళ్తుందన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే అభివృద్ధిలో సైతం ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ప్రజలంతా జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ఓటువేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులూ పురుషోత్తం యాదవ్, బిఎస్ఎన కిరణ్, చంద్రిక గౌడ్, వరలక్ష్మి, గంగాధర్, రోజా, మహేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

అపార్ట్మెంట్ వాసులకు అభివాదం చేస్తున్న ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here