నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ మార్తాండ్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సాయి సుశీల ట్రేడర్స్ ను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్య అతిధిగా హాజరై స్థానిక నాయకులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్బంగా యాజమాన్యం ఏ. సురేందర్ యాదవ్, సంగమేశ్వర్ యాదవ్ కి శుభాభినందనలు తెలిపారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి, ఉన్నత శిఖరాలు చేరాలని కోరుకుంటున్నానని తెలిపారు.
వ్యాపార రంగంలో ఉన్న అవకాశాలు యువత ఉపయోగించుకోవాలని అన్నారు. స్వశక్తితో ఎదిగి, నలుగురికి ఉపాధి కలిగేలా ఉండాలని అన్నారు. వినియోగదారునికి నాణ్యమైన సేవలు అందించి, వారి మన్నన పొందాలని ఈ సందర్బంగా యాజమాన్యానికి సూచించారు. కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మొహ్మద్ గఫుర్, షేక్ అబ్దుల్ ఖాదర్, ఏండి జాహెద్, ఏండి షబ్బీర్, సలీం పటేల్, మొహ్మద్ ఆఫ్జాల్ ఖాన్, అబ్దుల్ సత్తార్, దీపక్, అక్షయ్, వసీమ్ పాల్గొన్నారు.