నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో నిర్వహిస్తున్న వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా భరతనాట్యం , కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. చెన్నైలో ప్రముఖ భరతనాట్య కళాకారిణి రాజేశ్వరి అరవింద్ తన ప్రదర్శనలో గణేశ శ్లోకం, అలరిపు, శ్రీ రాజరాజేశ్వరీ దరువు, ఆనంద నర్తన ప్రకాశం, బారో కృష్ణయ్య అంశాలను ప్రదర్శించి మెప్పించారు.
కందుల కూచిపూడి నాట్యాలయం గురువు రవి కూచిపూడి శిష్య బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన ఆధ్యంతం అలరించింది. గజవదన బేడువే, గరుడ గమన, నమశ్శివాయతే, విన్నపాలు వినవలె, వినరో భాగ్యము, నారాయణీయం, ఇతడే పరబ్రహ్మ, తిల్లాన అంశాలు సహస్ర, మధులిక, హంసిని, మిత్రవింద వాసవి, శ్రీలేఖ ప్రదర్శించి మెప్పించారు.