నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ సాధన ఉద్యమకారుడు సాయి చందు అకాల మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు శేరిలింగంపల్లి నియోజకవర్గం ఉద్యమకారులు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హాఫిజ్ పేట్ డివిజన్ లోని తమ ఇంటి చందు చిత్రపటం ఏర్పాటు చేయగా మిద్దెల మల్లారెడ్డి, తిరుమలేష్, బాబు మోహన్, మల్లేష్, రాజు యాదవ్, మధు, పయీమ్, పాల్గొని పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.