- ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో అన్ని వర్గాలు, మతాల పండగలు గొప్పగా జరుగుతున్నాయని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మైనారిటీ ప్రజలు ప్రభుత్వానికి నిరంతరం అండగా ఉండా లని, విశ్వమానవ శాంతి కోసం జరిగే బక్రీద్ ప్రార్థనల ద్వారా అల్లా దీవెనలతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీలకు అత్యంత ప్రాధాన్యత లభిస్తోందని పేర్కొన్నారు.
బక్రీద్ పర్వదినం సందర్భంగా మాదాపూర్ డివిజన్ ఆదిత్య నగర్ ఈద్గా వద్ద సామూహిక ప్రార్ధనలో మాదాపూర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ప్రార్ధనలో పాల్గొని మైనారిటీ ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాదాపూర్ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, జనరల్ సెక్రటరీ సాంబశివరావు, మైనారిటీ నాయకులు షోయబ్, అహ్మద్, లియకత్, రహీం, బాబూమియా, సలీం, ముక్తర్, మియన్, రెహ్మాన్, రాములు యాదవ్, ఖాజా, మూర్తి, జయ సాయి, రాజు పాల్గొన్నారు.