- సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చ
నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం నాగార్జున హోమ్స్ నిజాంపేట్ రోడ్ హైదర్ నగర్ డివిజన్లలో పావులూరి మురళీధర్, కుమార్, రాజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్ పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారాల గురించి చర్చించారు. బిఆర్ఎస్ పార్టీని బలోపేతం కోసం తగిన సూచనలు సలహాలు అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాల గురించి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో రమేష్, పార్టీ నాయకులు ఉమేష్, సత్య రెడ్డి , షరీఫ్ బాయ్ పాల్గొన్నారు.