అభివృద్ధి కోసం అందరం ఒక్కటవాలి: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

  • మస్జీద్ ఈ హార్కను సందర్శించిన రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లోని బాపునగర్ కాలనీ మస్జీద్ ఈ హార్కలో అన్ని మత విశ్వాసాల కోసం సమాజంలో ఐక్యత, శాంతి, సామరస్య భావాలను పెంపొందించడానికి నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు.

మస్జీద్ ఈ హార్కలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఇస్లాం, ముస్లింల పట్ల ఉన్న అపోహలను తొలగించి మన దేశం శ్రేయస్సు, అభివృద్ధి కోసం మనమందరం ఒక్కటవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మస్జీద్ ప్రెసిడెంట్ మహమ్మద్ సలీం, జనరల్ సెక్రెటరీ యూసుఫుద్దిన్, మహమ్మద్ అక్బర్, సర్వర్, తాహెర్, ముంతాజ్ ఖాన్, ముంతాజ్ బేగం పాల్గొన్నారు.

మస్జీద్ ఈ హార్కలో ఇస్లాం మత గ్రంథాలను పరిశీలిస్తున్న కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here