నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఏ బ్లాకులో 7, 8, 17 వీధుల్లో నూతనంగా జరుగుతున్న అంతర్గత రోడ్ల పనుల తీరును స్థానిక నాయకులతో కలసి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పర్యవేక్షించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కొండాపూర్ డివిజన్ పరిధిలో 80% శాతం అభివృద్ధి పనులను పూర్తి చేశామని అన్నారు.
ముఖ్యంగా పేదలు నివసించే బస్తీలలో మౌలిక వసతులైన తాగునీరు, వీధి దీపాలు, అంతర్గత రోడ్లు, విద్యుత్ లైన్ల క్రమబద్దికరణ వంటి పలు అభివృద్ధి పనులను పూర్తి చేశామన్నారు. పేద ప్రజల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి చిత్తశుద్ధితో పలు సంక్షేమ పధకాలు అమలు చేస్తూ, పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తుందని తెలిపారు. జిహెచ్ఏంసీ వర్క్ ఇన్ స్పెక్టర్ రవి, రజాక్ భాయ్, ఖాజా భాయ్, హనుమంతు రావు, భగవాన్ దాస్, సంతోష్, సంజు, జహంగీర్, షరీఫ్, సోహెల్, బాబురావు, రహీం ఉన్నారు.