మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): ఆటో డ్రైవర్లు ప్రయాణీకులతో మర్యాదపూర్వకంగా మెలగాలని మియాపూర్ ఇన్స్‌పెక్టర్ వెంకటేష్ సామల అన్నారు. ఆదివారం ప్రపంచ మానవ హక్కుల సంఘం, రాబిన్ హుడ్ ఆర్మీ ఆధ్వర్యంలో ఓలా ఫౌండేషన్ సహకారంతో మియాపూర్ లోని విశ్వనాథ గార్డెన్ లో 200 మంది ఆటో డ్రైవర్లకు నిత్యావసర వస్తువుల కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మియాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, సబ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ లు ప్రపంచ మానవ హక్కుల సంఘం రాష్ట్ర చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి, రాబిన్ హుడ్ ఆర్మీ హైదరాబాద్ ప్రతినిధులతో కలిసి ఆటో డ్రైవర్లకు కిట్లు అందజేశారు. అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ స్నేహపూర్వకంగా ఉండాలని అన్నారు. డ్రైవర్లు తమ పిల్లలకు మంచి చదువులు చెప్పించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరలా తీర్చిదిద్దాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలని, డాక్యుమెంట్స్ ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ సి తప్పకుండా కలిగి ఉండాలని సూచించారు. లాక్‌డౌన్ సమయంలో సైతం సేవా కార్యక్రమాలు నిర్వహించిన రాబిన్ హుడ్ ఆర్మీ, ప్రపంచ మానవ హక్కుల సంఘం ప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇటువంటి సేవా కార్కక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ మానవ హక్కుల సంఘం మహిళ వింగ్ డైరెక్టర్ బి. సంధ్య రెడ్డి, రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ కొమ్ముల శ్యామ్, రంగారెడ్డి జిల్లా సెక్రెటరీ బేగరి చెన్నయ్య , మియాపూర్ ఆటో యూనియన్ అధ్యక్షుడు గోల్కొండ తిమ్మరాజు, బాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
