33వ రోజు కు చేరిన గడపగడపకు బిజెపి రవన్న ప్రజా యాత్ర
నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా ప్రతినిధులు అభివృద్ధి పేరిట ప్రజలను దోచుకుతింటున్నారని బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ అన్నారు. గడపకు బిజెపి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎక్కడ చూసినా అభివృద్ధి చెందని కాలనీలే కనిపిస్తున్నాయని, ఎక్కడ చూసినా ప్రజా సమస్యలేనని, అవినీతి బిఆర్ఎస్ పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికీ అందని పెన్షన్స్ ,రేషన్ కార్డులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారని తెలిపారు.
డబుల్ బెడ్ బెడ్ రూమ్ ఎక్కడ ప్రజలకు అందలేదని, దళిత బంధు కూడా ప్రజాప్రతినిధుల అనుచరులకే చెందుతున్నాయని, మరి కొద్ది రోజుల్లోనే మంచి రోజులు వస్తాయని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు పర్వతాలు యాదవ్, శ్రీహరి, నరేందర్ రెడ్డి, గోవర్ధన చారి , సాయికుమార్, విజయ్ కుమార్, వెంకటేష్, శ్రీధర్ పటేల్, బాలు యాదవ్, శ్రీకాంత్ యాదవ్, గోపాలరావు, నర్సింగ్ రావు, నర్సింగ్ యాదవ్, వెంకటస్వామి రెడ్డి, తులసీదాస్, నరేష్, సంపత్, పవన్, రవి, అవినాష్, యశ్వంత్, లోకేష్ కామరాజ్, మహేందర్, శ్రీలత, అరుణ, రేణుక మొదలవారు పాల్గొన్నారు.