- కుక్కర్లపై కాంగ్రెస్ నాయకుడు మారబోయిన రఘునాథ్ యాదవ్ ఫోటో ముద్రింపు
- స్వాధీనం చేసుకున్న పోలీసులు
- స్థానిక కాంగ్రెస్ నాయకుల అరెస్ట్
నమస్తే శేరిలింగంపల్లి : ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఓటర్ల మద్దతు కోసం కొత్త పుంతలు తొక్కుతున్నారు పలు పార్టీల నాయకులు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఎందాకైనా వెళ్తున్నారు. ఇందులో భాగంగానే గచ్చిబౌలి డివిజన్ పరిధి గోపన్ పల్లి తండాలోని ఓ ఇంట్లో రైస్ కుక్కర్లను పదిల పర్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసుల దాడిలో ఈ ఘటన బయటపడింది. ఓటర్లకు పంచిపెట్టేందుకు సిద్దంగా ఉన్న 87 కుక్కర్లు కాంగ్రెస్ పార్టీ కి సంబంధించినవిగా పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు రాములు నాయక్, నరసింహా లను అదుపులోకి తీసుకున్నారు. రైస్ కుక్కర్ల పంపిణీతో సంబంధం ఉన్న అందరిపై చర్యలు తీసుకుంటామని మాదాపూర్ ఏసిపి శ్రీనివాస్, గచ్చిబౌలి ఇన్ స్పెక్టర్ జేమ్స్ బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించి తెలిపారు. ఈ మేరకు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే సదరు బాక్స్ లపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు మారబోయిన రఘునాథ్ యాదవ్ ఫోటో ముద్రించి ఉండటం విశేషం.