నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లోని పాపిరెడ్డి కాలనీ బీరప్ప దేవాలయం సమీపంలో బస్తీలోని డ్రైనేజీ వ్యవస్థ దుర్భర పరిస్థితిలో ఉన్నదని, తక్షణమే డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని స్థానిక నివాసితులు శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కి విన్నవించారు.
విషయం తెలుసుకున్న కార్పొరేటర్ తక్షణమే సానుకూలంగా స్పందిస్తూ డ్రైనేజీ సమస్య ఉన్న ప్రాంతానికి వెళ్లి స్వయంగా పరిశీలించారు. అనంతరం, బస్తీ వాసులకు సమస్య పరిష్కరించే దిశగా చర్యలు చేపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ సూపర్వైజర్ సురేష్, పాపిరెడ్డి కాలనీ బస్తీ కమిటీ ప్రెసిడెంట్ తలారి విజయ్, కొయ్యడ లక్ష్మణ్ యాదవ్, వెంకటేశ్వర్లు, అజీమ్, సాయి నందన్, మాల కొండయ్య, శ్రీనివాస్, శ్రీలక్ష్మి, మురళి, రాజేశ్వరి, సుభాష్, బస్తివాసులు పాల్గొన్నారు.