సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

  • కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
కంటివెలుగు కార్యక్రమంలో వైద్య పరీక్షలు పరిశీలిస్తున్న ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపల్లి: రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కమ్యూనిటీ హల్ లో కంటి వెలుగు కేంద్రాన్ని ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉషారాణి, ఏ ఎం హెచ్ ఓ డాక్టర్ కార్తిక్, డాక్టర్ రవీనా, మియాపూర్ డివిజన్ బిఆర్ ఎస్ నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, రెండో విడుత కంటి వెలుగు 100 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ప్రజలందరికీ కంటి పరీక్షలు, వైద్య పరీక్షల అనంతరం అవసరం ఉన్నవారికి ఉచితంగా కళ్ళ అద్దాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని అన్ని కాలనీల ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, ఏరియా కమిటి మెంబర్లు, బూత్ కమిటి మెంబర్లు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, జిహెచ్ఎంసి అధికారులు, సిబ్బంది, వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మయూరి నగర్ కమ్యూనిటీ హల్ లో కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here