నమస్తే శేరిలింగంపల్లి : 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం గ్రామంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతీయ యువజన సంఘం (పెద్ద సమాజం) వద్ద నిర్వహించిన వేడుకల్లో బిజెపి రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి మూల అనిల్ గౌడ్ త్రివర్ణ పతాకావిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎందరో వీరుల త్యాగాల పునాదుల మీద ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని అన్నారు. ఈ దేశం గత పదేళ్లలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక దేశంగా అవతరించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాండు వస్తాద్, శ్రీనివాస్ యాదవ్, నరేందర్ ముదిరాజ్, కృష్ణ ముదిరాజ్, సురేష్, నరేందర్, యాదవ్ శ్రీశైలం, వెంకటేష్ గౌడ్, దేవి ముదిరాజ్, నరిగెల ప్రభాకర్, అంబటి అశోక్, దయాకర్, గ్రామంలోని యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.