- పునాస మామిడి మొక్కలు నాటిన అసిస్టెంట్ ఇంజనీర్ శంకర్
నమస్తే శేరిలింగంపల్లి : 78వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని బాలాజీ నగర్ సెక్షన్ ఆవరణలో అసిస్టెంట్ ఇంజనీర్ శంకర్ సార్ జెండా విష్కరణ చేశారు. సెక్షన్ కార్మికులందరూ పాల్గొన్నారు. బాలాజీ నగర్ సబ్ స్టేషన్ 33/11 కేవీ లో కైతలాపూర్ సబ్ స్టేషన్ ఆవరణలలో.. బాలాజీ నగర్ సెక్షన్ విద్యుత్ కార్మికులతో కలిసి పునాస మామిడి (78 మొక్కలను) మొక్కలను నాటారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాలాజీ నగర్ సెక్షన్ ఫోర్ మెన్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్, సైబర్ సిటీ సర్కిల్ ప్రెసిడెంట్ 327 యూనియన్ కే. వెంకటేశ్వర్లు, బాలాజీ నగర్ సెక్షన్ సబ్ ఇంజనీర్ సంతోష్, బాలాజీ నగర్ సెక్షన్ లైన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, బాలాజీ నగర్ సెక్షన్ లైన్ మెన్ కొండాపూర్ డివిజన్ సెక్రెటరీ 327 యూనియన్ రాజేందర్ నాయక్, బాలాజీ నగర్ సెక్షన్ లైన్మెన్ రమణ, బాలాజీ నగర్ సెక్షన్ జేఎల్ఎం సంతోష్, శివ, నయీమ్ మరియు ఆర్టిజన్ కార్మికులు వెంకటేష్, మల్లేష్, రమేష్, రాజు నాయక్ మొదలగు కార్మికులు పాల్గొన్నారు.