కబ్జాకోరులే రాజ్యమేలుతున్నారు : రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

  • 10వ రోజుకు రవన్న ప్రజా యాత్ర
రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ కి హారతి పడుతూ..

నమస్తే శేరిలింగంపల్లి: ఆల్విన్ కాలనీ డివిజన్ లో అధికార పార్టీ నాయకులు కబ్జా కోరులుగా మారి డివిజన్ మీద పడి దండుకు తింటున్నారని బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ విమర్శించారు. కూకట్ పల్లి బిజెపి పార్టీ ఇన్ ఛార్జి మాధవరం కాంతారావు, జిల్లా ఉపాధ్యక్షులు రామరాజు , నరేందర్ రెడ్డి, కుమార్ యాదవ్, రవీందర్ రావు, కమలాకర్ రెడ్డి, నాగుల్ గౌడ్, నర్సింగ్ యాదవ్, నరసింహ చారి, రాజు, రఘు ఆధ్వర్యంలో పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ
పేదలు పింఛన్ అదిగితే కమిషన్ అడిగే నాయకులు ఈ డివిజన్లో ఉన్నారని దళిత బంధు, షాదీ ముబారక్ ఇలాంటి పథకాలలో కమిషన్లు వసూలు చేస్తూ ఉన్నత వర్గాల వారికే సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. ప్రధానంగా తమ దృష్టికి వచ్చిన చెరువు, కుంటలు కబ్జా, ప్రభుత్వ భూములు కబ్జాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడం వంటివి వచ్చాయని, వాటి పరిష్కారం కోసం మార్గం దిశగా ప్రయాణిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, రాష్ట్ర , జిల్లా నియోజకవర్గ, బీజేవైఎం, మహిళా మోర్చా పాల్గొన్నారు.

కాలనీలలో నెలకొన్న సమస్యలు పరిశీలిస్తున్న రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here