బిజెపి విజయాలు, సంక్షేమం పై కరపత్రాల ఆవిష్కరణ

  • మహాత్మా జ్యోతిబా ఫూలేకు నివాళి

నమస్తే శేరిలింగంపల్లి: మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు శెట్టి కురుమ, డివిజన్ ఓ.బీ.సి మోర్చ అధ్యక్షుడు ఇరుమళ్ల ఎల్లేష్ కురుమ ఆధ్వర్యంలో తారా నగర్, లింగంపల్లి తుల్జా భవాని గుడి వద్ద జ్యోతిబా ఫూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం పల్లె పల్లెకు ఓబీసి – ఇంటింటికీ బిజెపి కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం సాధించిన విజయాలు, ఓబీసీల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాల గురించిన పోస్టర్లు, కరపత్రాల వితరణ చేశారు.

బిజెపి విజయాలు, సంక్షేమం పై కరపత్రాలు ఆవిష్కరిస్తున్న శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు శెట్టి కురుమ, డివిజన్ ఓ.బీ.సి మోర్చ అధ్యక్షుడు ఇరుమళ్ల ఎల్లేష్ కురుమ

కార్యక్రమంలో భువనగిరి జిల్లా బీజేపీ ఇన్ ఛార్జ్ నంద కుమార్ యాదవ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు మహిపాల్ రెడ్డి, రాష్ట్ర ఎస్.సి మోర్చ అధికార ప్రతినిధి కాంచన కృష్ణ, జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి శాంతి భూషణ్ రెడ్డి, జిల్లా మహిళా మోర్చ ఉపాధ్యక్షురాలు బీమని విజయ లక్ష్మి, జిల్లా మేధావుల సెల్ కన్వీనర్ రాఘవేందర్ రావు, సీనియర్ నాయకులు మాధవ స్వామి, నీరటి చంద్ర మోహన్, డివిజన్ ఉపాధ్యక్షులు శ్రావణ్ పాండే, స్థానికులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here