కబ్జా కోరుల వలలో చెరువులు, నాలాలు : రాష్ట్ర బిజెపి రవికుమార్ యాదవ్

  • 15 వ రోజుకు చేరిన రవన్న ప్రజా యాత్ర
రవన్న ప్రజా యాత్ర లో భాగంగా గడప గడపకు పాదయాత్ర చేపట్టిన బిజెపి రాష్ట్ర రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: ఆల్విన్ కాలనీ డివిజన్ సాయి చరణ్ కాలనీ, ఇందిరానగర్, శంసిగూడలలో ప్రజా యాత్రలో భాగంగా గడపగడపకు బిజెపి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఆల్విన్ కాలనీ డివిజన్లో చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా కోర్టుల పరమవుతున్నాయని, ఫలితంగా వర్షాకాలంలో పరిసర ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ సీనియర్ నాయకులు కుమార్ యాదవ్, నర్సింగ్ యాదవ్, నరసింహ చారి, శ్రీధర్ చారి, ఆంజనేయులు, శ్రీనివాస్ పంతులు, సీతారామరాజు, రాష్ట్ర , జిల్లా, మహిళా మోర్చా, యువ మోర్చా, వివిధ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

గడప గడపకు పాదయాత్రలో పార్టీ సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను ప్రజలకు అందజేస్తున్న రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here