- గడప గడపకు బీజేపీ రవన్న ప్రజా యాత్ర
- పూల బాటలు వేసి ఘన స్వాగతం పలికిన ప్రజలు
- టైం పాస్ చేసే రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెప్తారు : బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలతో మమేకమై చేపడుతున్న ‘గడప గడపకు బీజేపీ రవన్న ప్రజా యాత్ర” 14 వ రోజు చేరింది. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ నానక్‌రామ్‌గూడ లో బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ గోపనపల్లి తండా లో రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల గోసలను పట్టించుకోని కల్వకుంట్ల కుటుంబం, స్వార్థ ప్రయోజనాలే పరమార్థంగా, ప్రతిపక్షాలను తప్పుడుకేసులు బనాయించి భయపెడుతున్నారని, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీక్ విషయంలో న్యాయవిచారణకు భయపడటం ఎందుకని అన్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడి, టైం పాస్ చేసే రాజకీయాలకు తగిన బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి స్థానిక ప్రజలతో కలిసి పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించారు. గతంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సౌకర్యం, రోడ్లు తదితర వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళమని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారి కృషితో అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా కాలనీల రూపురేఖలు మారాయని ఆయా స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కార్పొరేటర్ గారికి హారతులతో ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా పనిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ పరిధి లోనీ రాష్ట్ర, జిల్లా, సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, మహిళ నాయకులు, మహిళ కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు, అభిమానులు, కాలనీ వాసులు, స్థానిక నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.