- ‘కాలనీల కాంటాక్ట్’ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూకాలనీ, జెపి నగర్ కాలనీ, ఎం ఏ నగర్ కాలనీలలో కాలనీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి, వివిధ శాఖల సంబంధిత అధికారులతో కలిసి మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పాల్గొని మాట్లాడారు. ప్రతి కాలనీ, బస్తీ, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లలో పలు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా.. జిహెచ్ ఎంసీ, వివిధ ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రత్యేక్షంగా వెళ్లి సమస్యలు తెలుసుకోవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ప్రభుత్వ విప్ ఆరెకపూడి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.
కాలనీ లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఇదొక చక్కటి వేదికని అన్నారు. దాదాపు 15 డిపార్ట్ మెంట్ అధికారులు ఒకే వేదికలో ఉండటంతో ఆయా కాలనీల వాసులు సమస్యలను నేరుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, కాలనీ ప్రతినిధులు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రతిఒక్కరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని కాలనీలను, ప్రాంతాలను ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసి అధికారులు, హెచ్ ఎం డబ్ల్యూ ఎస్ అధికారులు, వివిధ శాఖల సంబంధిత అధికారులు పాల్గొన్నారు.