- మున్సిపల్ శాఖమంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్
- కనులపండువగా భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం
- బోనాలు సమర్పించిన భక్తులు
- పాల్గొని పూజలు చేసిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో నల్లగండ్ల గ్రామంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం వేడుకగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త, మాదాపూర్/హఫీజ్ పెట్ డివిజన్ కార్పొరేటర్లు వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొని మున్సిపల్ శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రత్యేక పూజలు చేశారు. అయితే ఉదయం నుంచే కల్యాణం విశిష్టతను తెలియచేస్తూ ఒగ్గలో, పోతురాజుల విన్యాసాల నడుమ భక్తులు స్వామివారికి బోనాలు సమర్పించారు.

కల్యాణంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్, కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు వివేక్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్సీ ఎం.ఎస్ ప్రభకర్, తెలంగాణ టూరిజం చైర్మన్ శ్రీనివాస్ గుప్త, మాదాపూర్ డిసిపి శిల్పవల్లి , కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, గంగాధర్ రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు, ప్రజలు, మహిళలు, భారిసంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు.
