అధికార పార్టీని గద్దె దించే వరకు పాదయాత్ర

  • నిరంకుశ , నియంతృత్వ, కుటుంబ పాలన అంతమొందించడమే లక్ష్యం : బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
  • రవన్న ప్రజాయాత్రను ప్రారంభించిన చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యుడు కొండ ఈశ్వర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి
రవన్న ప్రజాయాత్రలో చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యుడు కొండ ఈశ్వర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి, రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : నిరంకుశ , నియంతృత్వ, కుటుంబ పాలన అంతమొందించడానికి మొదలుపెట్టిన పాదయాత్ర, అధికార పార్టీని గద్దె దించే వరకు కొనసాగుతుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ అన్నారు. అంతకుముందు ఆల్విన్ కాలనీ డివిజన్ లోని అభయాంజనేయ స్వామి టెంపుల్ వద్ద తలపెట్టిన రవన్న ప్రజా యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యుడు కొండ ఈశ్వర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి, నియోజకవర్గం కన్వీనర్ రాఘవేంద్రరావు, విజిత్ వర్మ, కో కన్వీనర్ మణి భూషణ్, డివిజన్ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రామరాజు, కుమార్ యాదవ్, నరేందర్ రెడ్డి, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, రవీందర్రావు, నవతా రెడ్డి హాజరై పాదయాత్రను ప్రారంభించారు.

రవన్న ప్రజాయాత్రలో మాట్లాడుతున్న రవికుమార్ యాదవ్, పక్కన మాజీ పార్లమెంటు సభ్యుడు కొండ ఈశ్వర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి, తదితరులు

రవికుమార్ యాదవ్ తలపెట్టిన పాదయాత్ర రేపటి శేరిలింగంపల్లి విజయానికి నాంది పలకాలని, అందరు ఈ కార్యక్రమంలో పాల్గొని గడపగడపకు బిజెపిని తీసుకుపోవాలని  చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యుడు కొండ ఈశ్వర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు హరీష్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కో కన్వీనర్ మనీ భూషణ్ మాట్లాడుతూ అందరం కలిసి కట్టుగా ఒకటై అధికార పార్టీని చుట్టుముట్టాలన్నారు. రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ రోజు రోజుకి అధికార పార్టీ అరాచకాలు, దౌర్జన్యాలు, కబ్జాలు మితిమీరిపోతున్నాయని వీటన్నిటికీ అడ్డు కట్టడానికి రవన్న ప్రజా యాత్ర ద్వారా నియోజకవర్గంలో గడపగడపకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పాదయాత్ర ఆల్విన్ కాలనీలో దాదాపు పది రోజులపాటు కొనసాగుతుందని ప్రెస్ మిత్రులకు, కార్యకర్తలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, నవీన్ గౌడ్, రాధాకృష్ణ యాదవ్, ఎల్లేష్, అనిల్ కుమార్ యాదవ్, పర్వతాలు యాదవ్, శ్రీహరి, రఘు, నర్సింగ్ యాదవ్, నరసింహ చారి, గోపాల్ రావు, పద్మ, అనిత, శ్రీలత, లలిత రెడ్డి, రేణుక పాల్గొన్నారు.

రవికుమార్ యాదవ్ మద్దతు తెలుపుతూ..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here