నమస్తే శేరిలింగంపల్లి : ప్రజల పై అనేక రకాల భారాలు వేస్తున్న కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని బిఆర్ఎస్ ప్రభుత్వాల లక్ష్యాన్ని ప్రజలు తిప్పి కొట్టాలని యంసిపిఐ(యు) కామ్రేడ్ గాదగోని రవి ప్రజలకు పిలుపునిచ్చారు. మియాపూర్ ఎంఏ నగర్ లోని గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయం వద్ద జరిగిన గ్రేటర్ హైదరాబాద్ స్థాయి పార్టీ సభ్యుల విస్తృత సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిన్నటి వరకు పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల భారాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలపై విపరీతంగా మోపిందని అన్నారు. ఇటీవల త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలలో ఎన్నికల అనంతరం వంటింటి గ్యాస్ పైన 50 రూపాయల ధరను పెంచి తన ఘనతను చాటుకుందని ఆరోపించారు. ప్రస్తుతం డిజిటల్ ఇండియా పేరుతో ప్రజల వాడుక అవసరాలను డిజిటైలేజషన్ చేసి ఏప్రిల్ ఒకటి నుండి ప్రజల బ్యాంకింగ్ లావాదేవీలపై చార్జీలు వేయడం వీటి మీదనే కాకుండా నిర్మాణ రంగం సిమెంట్ పై, అత్యధిక ఖరీదైన వైద్యా ఖర్చుతో బాధపడుతున్న ప్రజలకు నిత్యం వాడే మందుల పైన కూడా పన్ను పోటు విధించడం బిజెపి తన పెట్టుబడి దారి కార్పొరేట్ వర్గ స్వభావాన్ని చేస్తుందని ఆరోపించారు.
రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి తాను చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి దేశంలోని బిజెపికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని అన్ని ప్రాంతీయ పార్టీల గడపలను ఎక్కుతూ,మొక్కుతూ ప్రదక్షిణలు చేస్తున్నారని, తాను ఎన్ని చేసినా తన అవినీతి కుంపటిలో కూరుకుపోయి చివరికి మసి అయితారని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యురాలు బి. విమల అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఎం సి పి ఐ యు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, కుంభం సుకన్య, వి. తుకారాం నాయక్, గ్రేట్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్, కార్యదర్శి వర్గ సభ్యులు తాండ్ర కళావతి ఏ పుష్ప, కర్ర దానయ్య, పల్లె మురళి, ఇ.దశరథ్ నాయక్, గ్రేటర్ కమిటీ సభ్యులు వై.రాంబాబు, బి.యాదగిరి, కన్నశ్రీనివాస్, దుర్గ ప్రసాద్, చందర్, యం.రాజు, యం.రాణి, దార లక్ష్మీ, టి.నర్సింగ్, లలిత, ఇసాక్, ఖాదర్ వలీ, గుడిసె శీను పాల్గొన్నారు.