నమస్తే శేరిలింగంపల్లి : ఎమ్మెల్యే కోటాలో కుర్మయ్యగారి నవీన్‌కుమార్ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు మహ్మద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్సీలు కవిత, పట్నం మహేందర్ రెడ్డి, శంబిపూర్ రాజు, బండ ప్రకాష్, ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంత రావు, మాధవరం కృష్ణ రావు, KP వివేకానంద గౌడ్, నేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్ కలిసి పూల బొకే అందించి అభినందనలు తెలిపారు.
