నమస్తే శేరిలింగంపల్లి: కాలనీలలో సమస్యలు విలయతాండవం చేస్తుంటే అధికారులు నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సమంజసం కాదని బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ అన్నారు. గడప గడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా ఇంటి ఇంటికి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి తెలిసేలా కరపత్రం ఇస్తూ, వాల్ పోస్టర్ లో మోడీ సంక్షేమ పథకాలను ముద్రించి ప్రజలకు తెలిపారు.

ఆల్విన్ కాలనీ డివిజన్ లో జన్మభూమి కాలనీలో స్థానిక, జిల్లా ఉపాధ్యక్షులు రామరాజు, సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, కుమార్ యాదవ్, రవీందర్ రావు, కమలాకర్ రెడ్డి, నర్సింగ్ యాదవ్, నరసింహ చారి, స్రవంతి అనిత ఆధ్వర్యంలో బస్తీలో పర్యటించారు. కార్యక్రమంలో గురుమూర్తి, సాయి, రాము, నవీన్ గౌడ్, సందీప్ గౌడ్, రాయల్, ఆంజనేయులు పాల్గొన్నారు.
