మైనారిటీ ల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట : ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

  • ముస్లిం సోదర, సోదరిమనులకు దుస్తులు పంపిణి

నమస్తే శేరిలింగంపల్లి: రంజాన్ మాసం పర్వదినం ను పురస్కరించుకుని హాఫిజ్ పేట్ డివిజన్ పరిధి సాయి నగర్ లో మజీద్ ఏ ఇబ్రహీం మసీదు లో ముస్లిం సోదరులకు బట్టలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించి బట్టలు పంపిణి చేసారు .

ముస్లిం సోదర, సోదరిమనులకు దుస్తులు పంపిణి చేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముస్లిం సోదర, సోదరిమణులకు పండుగను ధనిక ,పేద బేధం లేకుండా సుఖసంతోషాలతో జరుపుకునేందుకు వీలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనస్సుతో బట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. రంజాన్ పండుగ ప్రజా జీవితాల్లో సుఖ సంతోషాలను అందించాలని అభిలషించారు. మైనారిటీ ల సంక్షేమానికి ప్రభుత్వం  పెద్ద పీట వేస్తుందని చెప్పారు.
కార్యక్రమంలో హాఫిజ్ పేట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్తర్, లాల్ మహ్మద్ పటేల్, షేక్ లాల్ పటేల్, అహ్మద్, షరీఫ్, అబ్దుల్ జబ్బార్, మహ్మద్ అజిమ్, హేమంత్, మున్సార్, అజార్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here