బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అక్తర్ ఆధ్వర్యంలో.. దవాత్- ఏ – ఇఫ్తార్

నమస్తే శేరిలింగంపల్లి: రంజాన్ మాసం పర్వదినంను పురస్కరించుకుని హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అక్తర్ ఆధ్వర్యంలో దవాత్- ఏ – ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేటర్లు హమీద్ పటేల్, నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్ గార్ల తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

దవాత్- ఏ – ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఇవ్వడం చాలా అభినదించదగ్గ విషయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించేందుకు మసీదులకు, ఈద్గాల అభివృద్ధి మరమ్మతులకు నిధులు కేటాయించడం, పండుగ సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు అశోక్ గౌడ్, రవి ముదిరాజు, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, శేరిలింగంపల్లి డివిజన్ బీఆర్ ఎస్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి, ప్రసాద్, కర్ణాకర్ గౌడ్, సంగారెడ్డి, పద్మారావు, నరేష్, అష్రప్, ఖదీర్, లాల్ మహ్మద్ పటేల్, షేక్ లాల్ పటేల్, అహ్మద్, షరీఫ్, అబ్దుల్ జబ్బార్, మహ్మద్ అజిమ్, హేమంత్, మున్సార్, అజార్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

దవాత్- ఏ – ఇఫ్తార్ విందులో స్లిం సోదరులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here