- ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకిలో మోతల అధికారుల పనితీరు
- 8 వ రోజు రవన్న ప్రజా యాత్రలో బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
నమస్తే శేరిలింగంపల్లి: అధికారులు, నాయకుల పనితీరు ఇంట్లో ఈగల మోత బయట పల్లకిల మోతా అన్నట్టుగా ఉందని ఎక్కడ చూసినా సమస్యలే దర్శనమిస్తున్నాయని బిజెపి రాష్ర నాయకుడు రవికుమార్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని తారక రామ్ నగర్ , గణేష్ నగర్, మహాత్మా గాంధీ నగర్, రాజీవ్ గాంధీ నగర్, సుభాష్ చంద్రబోస్ నగర్ అంబేద్కర్ నగర్, పలు కాలనీలలో చేపట్టిన రవన్న ప్రజా యాత్ర 8 వ రోజు చేరింది. ఇందులో భాగంగా బిజెవైఎం నేషనల్ ఆఫీస్ కోఆర్డినేటర్ కుమార్ యాదవ్ డివిజన్ , అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి , మహిళా మోర్చా అధ్యక్షురాలు అనిత , సీనియర్ నాయకులు నర్సింగ్ రావు యాదవ్, నరసింహ చారి, స్రవంతి, కవిత, రాజుతో సమస్యలపై పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ ఇక్కడ అభివృద్ధి కంటికి కనిపించడం లేదని, తాము పాదయాత్ర చేస్తూ సమస్యలను లేవనెత్తి అధికారుల దృష్టికి తీసుకువెళ్తే తప్ప, వారు స్వయంగా సమస్యలను గుర్తించడం లేదని తెలిపారు. ప్రతిరోజు ప్రతినిత్యం ప్రజల కోసం జాతీయ జనతా పార్టీ గడపగడపకు ఇంటి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకుని నాయకుల అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ, రాష్ట్ర , జిల్లా యువ మోర్చా, మహిళా మోర్చా, నాయకులు పాల్గొన్నారు.