చలివేంద్రం ప్రారంభం

నమస్తే శేరిలింగంపల్లి: పీజేఆర్ స్టేడియం చందానగర్ వద్ద స్పందన సేవ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గాంధీతో కలిసి రామోష్ మానవ హక్కుల ఫౌండేషన్ జాతీయ చైర్మన్ భారత ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్పందన సేవా అసోసియేషన్ ప్రెసిడెంట్ కొమ్ముల శ్యామ్ ఆధ్వర్యంలో నాలుగు, ఐదు సంవత్సరాలుగా చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు.

ప్రభుత్వ విప్ గాంధీతో కలిసి చలివేంద్రం ప్రారంభించిన తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి

యాచకులకు, అనాధలకు ఫంక్షన్లలో మిగిలిన అన్నాన్ని సేకరించి వారికీ అందజేయడం, చిన్నపిల్లలకి నుంచి పెద్ద పిల్లల వరకు బట్టలు, దుప్పట్ల పంపిణి లాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, ఇలాంటి మంచి సేవ కార్యక్రమాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో BRS సీనియర్ నాయకులు రఘునాథరెడ్డి, వేదం నరేష్ SCSC ఇండోర్ స్విమ్మింగ్ పూల్ MD K హనుమంతరావు , స్పందన సేవ ప్రెసిడెంట్ కొమ్ముల శ్యాము, వైస్ ప్రెసిడెంట్ బేగరి చెన్నయ్య, మ్యాతరి నవీన్, జనరల్ సెక్రెటరీ ఎస్ కె సలీం, ట్రెజరర్ అలిగే వినోద్, సెక్రెటరీ జంగా నాగేశ్వరరావు ‘పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here