- త్వరలో ప్రారంభం కానున్న ఆరంభ టౌన్షిప్ వెనక వైపు అప్రోచ్ రోడ్డు పనులు
నమస్తే శేరిలింగంపల్లి: పన్నెండు సంవత్సరాల ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించాయి. కొన్ని ఏండ్లుగా రాజీవ్ స్వగృహ ఆరంభ టౌన్షిప్ కు వెనక వైపు అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి దారులు తెరుచుకున్నాయి. దాదాపుగా కోటి 80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో కల్వర్ట్ నిర్మించి లింకు రోడ్డు ఏర్పాటుకు నిధులు మంజూరు అయ్యాయి. ఈ లింకు రోడ్డు వలన దాదాపు 2 కిలోమీటర్లు తగ్గడమే కాకుండా తొందరగా గమ్య స్థానానికి చేరుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో భాగంగా ప్రభుత్వ విప్ అరికెపూడి గాంధీ , కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ జిహెచ్ఎంసి అధికారులకు ఆదేశాలు జారీ చేయాగా.. అతి తొందరలోనే పనులను ప్రారంభిస్తామని వారు తెలిపారు. ఈ సందర్బంగా ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ తరపున వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరంభ టౌన్షిప్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజేష్ ఉన్నారు.