వేడుకగా బీజేపీ సీనియర్ నాయకుడు రంజిత్ సింగ్ నూతన గృహప్రవేశం

  • ముఖ్య అతిథులుగా హాజరైన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు మాజీ ఎం.పీ విజయశాంతి, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
బీజేపీ సీనియర్ నాయకుడు రంజిత్ సింగ్ నూతన గృహప్రవేశం సందర్బంగా పూజలు చేస్తున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు మాజీ ఎం.పీ విజయశాంతి, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్‌రామ్‌గూడ చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు రంజిత్ సింగ్ నూతన గృహప్రవేశం కార్యక్రమం వేడుకగా జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎం.పీ విజయ శాంతి, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిలకు రంజిత్ సింగ్ కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రంజిత్ సింగ్ కుటుంబ సభ్యులకు వారు శుభాకాంక్షలు తెలిపి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొద్దిసేపు వారితో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శివ సింగ్, తిరుపతి, సీనియర్ నాయకులు సవాభిరాజ్, రవి సింగ్, జగదీష్ సింగ్, దేవి సింగ్, సురేష్ సింగ్, రామ్ సింగ్, అభిషేక్ సింగ్, సంతోష్ సింగ్, యువరాజ్ సింగ్, సునీల్ గౌడ్, హరి ఓం, రంజిత్ సింగ్, లక్ష్మణ్, మురళీ, నర్సింగ్ నాయక్, టీంకు, శంఖేష్ సింగ్, రంజిత్ సింగ్ కుటుంబ సభ్యులు, స్థానిక నేతలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

బీజేపీ సీనియర్ నాయకుడు రంజిత్ సింగ్ కుటుంభం సభ్యులతో విజయశాంతి, గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here