నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మాదాపూర్ డివిజన్ ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర గౌడ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ వద్ద స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు.
సమావేశం ఏర్పాటు చేసి కాలనీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై స్థానిక ప్రజలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోకుల్ ప్లాట్స్ బిఆర్ఎస్ కాలనీ అధ్యక్షుడు బి.శ్రీనివాస్, వార్డ్ సభ్యులు గుమ్మడి శ్రీనివాస్, స్థానికులు ఉమేష్, శేఖర్, పరమేష్, వెంకటేశ్వరరావు, కాశినాథ్, జి.హెచ్.ఎం.సి వర్క్ ఇన్ స్పెక్టర్ వెంకటేష్ పాల్గొన్నారు.