ఒత్తిడిని అధిగమించి పరీక్షలు రాసేలా.. విద్యార్థులను తీర్చిదిద్దుతాం: బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

  • మసీద్ బండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘పరీక్ష పే చర్చ’
  • సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డ్రాయింగ్ పోటీలు
సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రాయింగ్ పోటీలను పరిశీలిస్తున్న రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: లింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీద్ బండలో జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్య పాఠశాలలో సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరీక్ష పే చర్చ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 9 మరియు 10 వ తరగతి విద్యార్థులకు బీజేపీ రాష్ట్ర నాయకుడు, సందయ్య మెమోరియల్ ట్రస్ట్ సెక్రెటరీ రవికుమార్ యాదవ్ డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడిని తగ్గించే చిట్కాలను పంచుకునేలా చేయడం, భయాందోళనకు గురి కాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసేలా చేయడం, పరీక్షలను పండుగలా జరుపుకోవాలనేదే ప్రధామంత్రి నరేంద్ర మోడీ ఉద్దేశమన్నారు. ప్రధాని ఆదేశాల మేరకు సందయ్య మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టామని, పెద్ద ఎత్తున విద్యార్థిని, విద్యార్థులు పాల్గొనడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్ర రావు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు అనంత రెడ్డి, సదానంద యాదవ్, కర్చర్ల ఎల్లేష్, శ్రీనివాస్, కరణ్ పాల్గొన్నారు.

మసీద్ బండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులతో బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here