- పాల్గొన్న అధ్యక్షులు కొండ విజయ్ కుమార్
నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ పి.కె.ఆర్. స్టేడియంలో రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అథ్లెట్లు ఎంపిక 100 మందితో ఘనంగా నిర్వహించామని జిల్లా అధ్యక్ష కొండా విజయ్ కుమార్, కార్యదర్శి, నూనె సురేందర్ తెలిపారు. 30 నుంచి 80 సంవత్సరాల వరకు మహిళా, పురుషుల అథ్లెట్లు అన్ని విభాగాలలో తమ ప్రతిభ కనబరిచారు.
అంతేకాక 80 మంది అథ్లెట్లు డిసెంబర్ రెండవ వారంలో హైదరాబాద్లో జరిగే రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో ఫిబ్రవరి 8-11 తేది వరకు జాతీయ పోటీలు జరగబోతున్నాయని చెప్పారు. అథ్లెట్లులకు అన్ని విధాలుగా శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా అథ్లెట్లు ఎంపిక ప్రక్రియ అఫీషియల్స్ డగ్లస్ బెర్నాడ్, యేసురత్నం ఆధ్వర్యంలో జరిగినట్లు పేర్కొన్నారు. ఎంపిక ప్రక్రియ విజయవంతమైందని, క్రీడాకారుడు కోశాధికారి స్వాతి ధర్మపురి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామింట్ సభ్యులు మానసపతి, శివలీల, సుల్తానా, శైలజ, సవిత, లావ్యవాణి, బాల్ రాజ్, రాజు బాపెట్టి, శ్రీనివాస్, అనిల్ శర్మ ‘ శ్రీనివాసులు’ ములరాడో, ‘ఆనంతాజ్, గోపాల్రావ్ పాల్గొన్నాడు.